హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు

- January 18, 2023 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు

హైదరాబాద్: అసోచామ్ 14వ అంతర్జాతీయ వార్షిక కాన్ఫరెన్స్ కమ్ అవార్డ్స్-సివిల్ ఏవియేషన్ 2023లో GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం "సాంకేతిక వినియోగంలో ఉత్తమ విమానాశ్రయం"గా ఎంపికైంది. విమానాశ్రయాలలో ఆవిష్కరణలను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేసారు. హైదరాబాద్ విమానాశ్రయం పటిష్టమైన భద్రతకు భరోసానిస్తూ ప్రయాణీకుల అనుభవాన్ని, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి వినూత్న సాంకేతిక పరిష్కారాలను అమలు చేయడంలో ముందంజలో ఉంది. ఇది దేశంలోని విమానాశ్రయ రంగంలో అనేక మొట్ట మొదటి సాంకేతిక ఆవిష్కరణలకు నాంది పలికింది, ఇందులో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మరియు సెంట్రలైజ్డ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (AOCC), E-బోర్డింగ్ సొల్యూషన్, ఎక్స్‌ప్రెస్ చెక్-ఇన్, కెమెరా ఆధారిత కాంటాక్ట్‌లెస్ టెర్మినల్ ఎంట్రీ, ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్ (ATRS), IoT ఆధారిత స్మార్ట్ ట్రాలీ మేనేజ్‌మెంట్, AI ఆధారిత ప్యాసింజర్ ఫ్లో మేనేజ్‌మెంట్, కాంటాక్ట్‌లెస్ CUSS (కామన్ యూజ్ సెల్ఫ్ సర్వీస్), వర్చువల్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ డెస్క్, HOI ఎయిర్‌పోర్ట్ యాప్ ద్వారా కాంటాక్ట్‌లెస్ F&B ఆర్డరింగ్, కాంటాక్ట్‌లెస్ ఎలివేటర్ కంట్రోల్ సిస్టమ్ , క్లౌడ్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థ, ఫాస్ట్‌ట్యాగ్ కార్ పార్కింగ్ తదితరం ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com