సౌదీ రిజర్వ్‌లో సందడి చేస్తున్న వలస పక్షులు

- January 20, 2023 , by Maagulf
సౌదీ రిజర్వ్‌లో సందడి చేస్తున్న వలస పక్షులు

రియాద్: కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ రాయల్ నేచురల్ రిజర్వ్ (KSRNR) లో దాదాపు 3,000 వలస పక్షులు సందడి చేస్తున్నాయి. పక్షులు శీతాకాలంలో KSRNR  కు వేలాదిగా తరలివస్తాయని ఫాల్ మైగ్రేషన్ సర్వేలో పాల్గొంటున్న పర్యావరణ నిపుణులు తెలిపారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) వర్గీకరణ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్న స్టెప్పీ ఈగిల్ (అక్విలా నిపలెన్సిస్),  ఇంపీరియల్ ఈగిల్ (అక్విలా హెలియాకా) కూడా ఈ సీజన్ లో నేచురల్ రిజర్వ్ లో కనువించు చేస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. రిజర్వ్ పరిరక్షణ బృందం అడవి జాతులను, వాటి నివాసాలను వేట, విషప్రయోగం, విద్యుద్ఘాతం వంటి నుండి పక్షి జాతులను రక్షించడానికి కార్యాచరణ ప్రణాళికలపై పని చేస్తోంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద రిజర్వ్‌గా పేరుగాంచిన KSRNR అద్భుతమైన భౌగోళిక, జీవ వైవిధ్యాన్ని కలిగిఉన్నది. ఇందులో అరేబియన్ ఒరిక్స్ (ఓరిక్స్ ల్యుకోరిక్స్), నుబియన్ ఐబెక్స్ (కాప్రా నుబియానా), అరేబియన్ ఇసుక గజెల్ (గజెల్లా మారికా), ఆసియా హౌబారా (మక్లామెన్‌డోబరా), గ్రిఫ్ఫోన్ రాబందు (జిప్స్ ఫుల్వస్) వంటి అరుదైన జాతులు ఉన్నాయి. అందుకే ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటుసంపాదించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com