జీవో నెం.1..సుప్రీం కోర్టు నిర్ణయంపై స్పందించిన చంద్రబాబు నాయుడు
- January 20, 2023
అమరావతి: ఇటీవల తీసుకువచ్చిన జీవో నెం.1పై ఏపీ హైకోర్టు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జీవో నెం.1పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
జీవో నెం.1పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు. హైకోర్టులో విచారణ ఉండగా, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సైకో తరహా నిర్ణయాలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. జీవో నెం.1ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రోడ్ల పై సభలు, సమావేశాలు, రోడ్ షోలకు సంబంధించిన అనుమతులపై ప్రభుత్వం జీవో నెం.1 తీసుకురాగా, ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా, జీవో నెం.1ను హైకోర్టు ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసింది. అదే రోజున హైకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. ఈలోపే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







