ప్రవాస భారతీయులకు శుభవార్త.. వారంలో 7 రోజులపాటు BLS కేంద్రాల సేవలు

- January 20, 2023 , by Maagulf
ప్రవాస భారతీయులకు శుభవార్త.. వారంలో 7 రోజులపాటు BLS కేంద్రాల సేవలు

యూఏఈ: దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా  ఔట్‌సోర్స్ సర్వీస్ ప్రొవైడర్, BLS ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ సెంటర్‌లు పాస్‌పోర్ట్, వీసా సంబంధిత సేవల కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసింది.ఈ కేంద్రాలు ఆదివారంతో సహా వారంలోని మొత్తం 7 రోజుల పాటు పనిచేస్తాయి. భారతీయ ప్రవాసుల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు దుబాయ్, షార్జాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇవి జనవరి 22 నుంచి పాస్‌పోర్ట్, వీసా సేవల కోసం దరఖాస్తును స్వీకరిస్తాయి.

BLS కేంద్రాలు

1. అల్ ఖలీజ్ సెంటర్,యూనిట్ నెం 118 -119, మెజ్జనైన్ ఫ్లోర్, అల్ ఐన్ సెంటర్ ఎదురుగా, మంఖూల్ రోడ్, బుర్ దుబాయ్ (పాస్‌పోర్ట్, వీసా విభాగం)

2. ప్రీమియం లాంజ్ సెంటర్, 507, హబీబ్ బ్యాంక్ AG జ్యూరిచ్ అల్ జవారా బిల్డింగ్, బ్యాంక్ స్ట్రీట్, ADCB బ్యాంక్ పక్కన, బుర్ దుబాయ్.

3.షార్జా HSBC సెంటర్, ఆఫీస్ నెం.11, మెజ్జనైన్ ఫ్లోర్, అబ్దుల్ అజీజ్ మాజిద్ బిల్డింగ్, కింగ్ ఫైసల్ స్ట్రీట్, హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ భవనం, షార్జా

అయితే, ఆదివారాల్లో తత్కాల్ కేసులు, అత్యవసర కేసులు (వైద్య చికిత్స, మరణం) మినహా కేవలం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అపాయింట్‌మెంట్ ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులను సమర్పించవచ్చు. వయో వృద్ధులకు వాక్ ఇన్ ప్రాతిపదికన దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పించారు. దరఖాస్తుదారులు (https://blsindiavisa-uae.com/appointmentbls/appointment.php) లింక్‌ని ఉపయోగించి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. పాస్‌పోర్ట్/వీసా సంబంధిత సేవలకు సంబంధించి ఏవైనా సందేహాలు/ఫీడ్‌బ్యాక్/ ఫిర్యాదుల కోసం దరఖాస్తుదారు ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రాన్ని (24*7) కాన్సులేట్ టోల్ ఫ్రీ నంబర్ 80046342లో సంప్రదించవచ్చు లేదా [email protected]; [email protected] మెయిల్స్ లో సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com