ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
- January 20, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కల్లు గీత కార్మిక కుటుంబాల కోసం ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని ప్రారంభించనున్నారు.ఈ పథకానికి సీఎం జగన్ శుక్రవారం ఆమోదం తెలిపారు.
ఈ పథకం ప్రకారం.. కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లు గీత కార్మికుడి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేస్తారు. ఇందులో రూ.5 లక్షల్ని కార్మిక శాఖ, మరో రూ.5 లక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే శాశ్వత అంగవైకల్యానికి గురైన కల్లు గీత కార్మికుడికి కూడా రూ.10 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత అంచనా ప్రకారం.. 95,245 కల్లు గీత కుటుంబాలు కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున 1,200 మంది కల్లు గీస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. వీరిలో 40 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
మిగతావారు తీవ్ర గాయాలపాలవడం, శాశ్వత వికలాంగులుగా మారడం జరుగుతోంది. అందుకే ఈ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తాజా పథకాన్ని రూపొందించింది. గత ప్రభుత్వ హయాంలో కల్లు గీత కార్మికులు మరణిస్తూ రూ.7 లక్షల పరిహారం అందేది. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు ఇచ్చేది. మిగతా రూ.5 లక్షలు చంద్రన్న బీమా పథకం కింద చెల్లించేవాళ్లు. ఇప్పుడు ఈ మొత్తం రూ.10 లక్షలకు చేరింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







