తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
- April 29, 2016
100 పూరిళ్లు దగ్ధం కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని పర్లోవపేటలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 100 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.50లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంలో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఇళ్లల్లో నివసించే వారంతా అడ్డా కూలీలే. ఇళ్లన్నీ ప్రమాదంలో కాలిపోవడంతో వారంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. బాధితుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.విషయం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజన్న సంఘటనాస్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వం అందించిన రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు అన్నీ మంటల్లో కాలిపోయాయని బాధితులు మంత్రికి తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బాధితులకు తక్షణసాయం అందించాలని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్‌ను చినరాజప్ప ఆదేశించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







