హూప్స్.! మహేష్-త్రివిక్రమ్ జర జాగ్రత్త సుమా.!

- January 20, 2023 , by Maagulf
హూప్స్.! మహేష్-త్రివిక్రమ్ జర జాగ్రత్త సుమా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సారి చేయబోయే షెడ్యూల్ లాంగ్ షెడ్యూల్ అనీ, కీలక పాత్ర ధారులంతా ఈ షెడ్యూల్ కోసం వర్క్ చేయనున్నారనీ సమాచారం. తాజా విషయమేంటంటే, ఈ సెట్‌కి సంబంధించిన కొన్ని లీకు ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయ్.
‘ఖలేజా’ ఫ్లేవర్‌తో వున్న విలేజ్ బ్యాక్ డ్రాప్‌ని తలపిస్తున్న ఫోటోల్లా కనిపిస్తున్నాయవి. దాంతో మహేష్ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అప్పుడే సినిమాకి లీకులంటే ఎలా.? అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. 
అయితే, టెక్నాలజీ బాగా పెరిగిపోయిన నేటి తరుణంలో ఇలాంటి ఫోటోలు లీక్ కాకుండా ఆపడమనేది అంత వీజీ కాదనే అభిప్రాయాలు కూడా వున్నాయ్. అఫ్‌కోర్స్.! కంటెంట్ బాగుంటే, ఎలాంటి లీకులూ సినిమా సక్సెస్‌ని ఆపలేవనుకోండి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com