హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!

- January 07, 2026 , by Maagulf
హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!

దోహా: క్రౌడ్‌సోర్స్డ్ గ్లోబల్ రిసోర్స్ అయిన నంబియో విడుదల చేసిన తాజా హెల్త్ కేర్ ఇండెక్స్ 2026 లో ఖతార్ మరోసారి ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో తన స్థానాన్ని నిలుపుకుంది. ఖతార్ 73.6 స్కోరుతో  18వ స్థానంలో నిలిచి, 2025 నాటి ర్యాంక్‌ను నిలుపుకుంది. అలాగే, ఆరోగ్య సంరక్షణ వ్యయ సూచిక 2026లో ఖతార్ 134.2 పాయింట్లతో 19వ స్థానంలో నిలిచింది.

ఇటీవలి సంవత్సరాలలో ఖతార్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యం, సేవల నాణ్యతలో పురోగతిని నమోదు చేసింది.  ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసింది. ముఖ్యంగా ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంరక్షణ, ఆహార భద్రత తదితర అంశాలు ఖతార్‌ను ప్రపంచంలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో ఒకటిగా నిలబెట్టాయని నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలలు ఉన్న ఈ జాబితాలో టాప్ 20లో మిడిలీస్టు మరియు ఆఫ్రికా నుండి ఖతార్ మాత్రమే చోటు సంపాదించింది.   

హెల్త్ కేర్ ఇండెక్స్ 2026లో మొదటి మూడు స్థానాలను తైవాన్ (86.5), దక్షిణ కొరియా (82.8) మరియు జపాన్ (80.0) దక్కించుకున్నాయి. గల్ఫ్ దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 70.8 పాయింట్లతో 28వ స్థానంలో నిలిచింది.  ఒమన్, సౌదీ అరబియా దేశాలు సంయుక్తంగా 62.2 పాయింట్లతో 53వ స్థానంలో, కువైట్ 58.6 పాయింట్లతో 66వ స్థానంలో నిలిచాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com