కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- January 07, 2026
కువైట్: కువైట్ వెలుపల పనిచేస్తున్న అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో ప్రమేయం ఉన్న ఇద్దరు భారతీయ ప్రవాసులకు క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. కైఫాన్ మరియు షువైఖ్ నివాస ప్రాంతాలలో రైడ్స్ సమయంలో అనుమానితులను డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో భద్రతా సిబ్బంది వారి వద్ద నుంచి సుమారు 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటమైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల నుండి సమాజాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రగ్ సంబంధిత నేరాలలో పాల్గొనే వారపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







