సునీల్ టైమ్ ఆయేగా.! తమిళ నాట ‘పూల రంగడి’ హవా.!
- January 23, 2023
సునీల్ జోరు మామూలుగా లేదండోయ్. ఒకప్పుడు స్టార్ కమెడియన్. రాజమౌళి పుణ్యమా అని ‘మర్యాద రామన్న’తో హీరో అయిపోయాడు. ఆ తర్వాత రెండు మూడు సూపర్ హిట్లు కొట్టి, నీరసించి పోయాడు.
హీరో అయ్యాక కమెడియన్‌గా అవకాశాలు తగ్గడంతో పాటూ, కెరీర్ కూడా పాతాళానికి పడిపోయింది. అటు హీరోకీ కాక, ఇటు కమెడియన్‌గానూ వుండలేక సతమతమైపోయాడు. ఆ తరుణంలోనే చిన్నా, పెద్దా తేడా లేకుండా ఏ సినిమా పడితే ఆ సినిమాలో చిన్న చిన్న రోల్స్‌తో సరిపెట్టుకున్నాడు.
సుకుమార్ ‘పుష్ప’లో సునీల్ కోసం ‘మంగళం శీను’ క్యారెక్టర్ ఎప్పుడయితే డిజైన్ చేశాడో.. ఇక ఆ తర్వాత నుంచీ సునీల్ విలన్ పాత్రలకే ఫిక్సయిపోయాడు. చాలా చిన్న సినిమాల్లో విలన్ రోల్స్ చేసేశాడు.
ఇక, ఇప్పుడు తమిళ తంబీలు సునీల్ విలనిజాన్ని తెగ ఇష్టపడిపోతున్నారట. దాంతో, తమిళ స్టార్ హీరోలు సునీల్ కోసం క్యూ కట్టేశారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సహా, కార్తీ, శివ కార్తికేయన్ తదితర హీరోల సినిమాల్లో సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు. విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా సినిమాలోనూ సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు. లేటెస్టుగా ఈ సినిమా నుంచి సునీల్ రోల్‌ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
దాంతో, సునీల్ విలనిజం తమిళ నాట ఇంతటితో తగ్గేదే లే.! అనిపిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







