ఏంటీ తమనూ.! ఎక్కడికెళితే అక్కడేనా నీ భజన.!
- January 23, 2023
సౌత్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సత్తా చాటుతున్నాడు థమన్. థమన్ ఆర్ఆర్ ఇస్తే మోత మోగాల్సిందే. ఆడియో ఒకింత అటూ ఇటూగా వున్నప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చితక్కొట్టేస్తున్నాడు థమన్ ఈ మధ్య.
అందుకే స్టార్ హీరోలకు ఫస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్షన్‌గా మారాడు థమన్. మ్యూజిక్ సంగతి సరే, ఈ మధ్య మీడియాలో బాగా టార్గెట్ అవుతున్నాడు థమన్. అందుకు కారణం ఆయన నోటి దురదే. కాస్త అతి చేస్తున్నాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాల టైమ్‌లో పవన్ జపం చేశాడు. మెగాస్టార్ సినిమాకి ఆయన జపం చేశాడు. అలాగే ఎవరి సినిమా చేస్తే వాళ్లనే ఆకాశానికెత్తేస్తున్నాడు.
మొన్న విజయ్‌తో ‘వారసుడు’ చేసినప్పుడు ఇంకేముంది జన్మ ధన్యమైంది.. ఇక్కడితో నా ప్రాణం పోయినా ఫర్లేదు.. అంటూ చాలా అతి చేశాడు. తాజాగా, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సక్సెస్ మీట్‌లో బాలయ్యను తనకు ‘శివుడు’గా అభివర్ణించుకున్నాడు. ఆ సినిమా టైమ్‌లో కనీసం ఆమ్లెట్ కూడా తినకుండా నిష్టగా వుండేవాడట. థమన్ ఈ మాటలకు నెటిజనం ఓవరాక్షన్ ఎక్కువైందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







