అండమాన్ నికోబార్ లోని 21 దీవులకు పేర్లు పెట్టిన ప్రధాని మోడీ
- January 23, 2023
న్యూఢిల్లీ: నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు ప్రధాని నామకరణం చేశారు. ఈ 21 దీవులకు పరమవీరచక్ర పురస్కారాలను అందుకున్న 21 మంది పేర్లను పెట్టారు.
ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ శేఖన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయిబ్ సుబేదార్ బానా సింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్ లాన్స్ నాయక్ కరమ్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ రామా రఘోబా రాణే, నాయక్ జాదునాథ్ సింగ్, హవల్దార్ పీరూ సింగ్, కెప్టెన్ జీఎస్ సలేరియా, లెఫ్టినెంట్ కల్నల్ ధాన్ సింగ్ తప్పా, సుబేదార్ జోగిందర్ సింగ్, మేజర్ శైతాన్ సింగ్, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ అబ్దుల్ హమీద్, లెఫ్టినెంట్ కల్నల్ ఆర్దేశిర్ బుర్జోరీ తారాపోర్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజరల్ హోషియార్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేత్రపాల్ ల పేర్లను 21 దీవులకు పెట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







