12వేల మంది ఉద్యోగుల తొలగింపుపై గూగుల్ సీఈవో వ్యాఖ్యలు
- January 24, 2023
లాస్ ఏంజిల్స్: 12 వేల ఉద్యోగుల తొలగింపును గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సమర్ధించుకున్నారు. సరైన సమయంలోనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. లేదంటే పరిస్థితి మరింత జఠిలంగా మారే అవకాశం ఉందన్నారు.
గూగుల్ సంస్థ సుమారు 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దానిపై సోమవారం ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడారు. కంపెనీ ప్రగతి మందగించిందని, అందుకే సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కంపెనీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కంపెనీ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత ఆరు శాతం ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చాలా స్పష్టంగా, చాలా నిర్ణయాత్మకంగా, చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే అప్పుడు సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







