అన్‌స్టాపబుల్ బాలయ్య.! పవన్ ఎపిసోడ్ వచ్చెదెప్పుడయ్యా.!
- January 27, 2023
ఓటీటీ ఆహా వేదికగా బాలకృష్ణ తనలోని స్పెషల్ టాలెంట్‌ని బయటికి తీసిన సంగతి తెలిసిందే. హోస్ట్‌గా తనదైన శైలిలో ఈ టాక్ షోని రక్తి కట్టిస్తున్నారు బాలయ్య. సినీ, రాజకీయ ప్రముఖులను ఈ షోలో భాగం చేస్తూ, అభిమానుల్ని అలరిస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్‌తో బాలయ్య చేసిన ఎపిసోడ్ అందరిలోనూ ఆసక్తి కనబరిచింది. ఆల్రెడీ షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా.? అని ఎదురు చూస్తున్నారు.
ఈ టైమ్‌లో గుడ్ న్యూస్ వచ్చింది. ఫిబ్రవరి 3న పవన్ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయనున్న ఈ ఎపిసోడ్ మొదటి భాగం డేట్ మాత్రమే ఫిక్స్ చేశారట. రెండో భాగం ఎప్పుడనేది తెలియాల్సి వుంది. పవన్ సినిమాలూ, రాజకీయాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఈ టాక్ షో ద్వారా బాలయ్య, పవన్‌ని అడిగి తెలుసుకున్నారని ప్రోమోల ద్వారా అర్ధమవుతోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







