ఫిబ్రవరి 1 నుండి రాష్ట్ర స్ధాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
- January 27, 2023
విజయవాడ: విద్యార్దులలోని క్రీడాస్పూర్తిని పెంపెందించే క్రమంలో మూడు రోజుల పాటు ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. స్పోర్ట్స్ , గేమ్స్ మీట్ కు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించి, వివరాలను ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుండి 3వ తేదీ వరకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆటల పోటీలను నిర్వహించనున్నామన్నారు. గత 24 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇది 25వ మీట్ కానుందని తెలిపారు. ఇప్పటికే పూర్వపు జిల్లాల స్దాయిలో ప్రాంతీయ స్టోర్ట్స్ మీట్ లు పూర్తికాగా, అక్కడ ప్రధమ , ద్వితీయ స్దానాలు దక్కించుకున్న వారు రాష్ట్ర స్ధాయికి అర్హత సాధించారని నాగరాణి తెలిపారు. తొలిరోజు కార్యక్రమానికి రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ హాజరు కానున్నారన్నారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో సంయిక్త సంచాలకులు పద్మారావు, ప్రాంతీయ సంయిక్త సంచాలకులు జెఎస్ ఎన్ మూర్తి, సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి విజయ భాస్కర్, శిక్షణ, ఉపాధి అధికారి డాక్టర్ రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్







