‘వాము’తో నొప్పులకు పెట్టేయండి చెక్.!

- January 27, 2023 , by Maagulf
‘వాము’తో నొప్పులకు పెట్టేయండి చెక్.!

నిజానికి మన వంటిల్లే పెద్ద మెడికల్ షాప్. ముఖ్యంగా పోపుల డబ్బా. పోపుల డబ్బాలోని ప్రతీ ఐటెమ్ ఒక ఔషధమే. శరీరానికి ఎలాంటీ హానీ చేయవు. ఏదైనా అననుకూల పరిస్థితులు తలెత్తితే, వెంటనే వాటికి ఉపశమనం కలిగించడానికి ఫస్ట్ ఎయిడ్ మాదిరి ఉపయోగపడుతుంటాయ్ పోపుల డబ్బాలోని ఐటెమ్స్.
పోపుల డబ్బాలో ఇంపార్టెంట్ ఐటెం ‘వాము’. వంటకు రుచి కలిగించేందుకు వామును వాడుతుంటారు. కేవలం రుచి మాత్రమే కాదు, వాము ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమైనది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
గ్యాస్ నొప్పులు, కడుపు నొప్పుల నుంచి వాము ఉపశమనం ఇస్తుంది. వాము రసం తాగడం ద్వారా ఆయా గ్యాస్ నొప్పులు తగ్గుతాయ్.
అలాగే, మైగ్రేన్ వంటి తలనొప్పులకీ వాము రసం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణను మెరుగు పరచడం, జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు వాము చక్కగా ఉపకరిస్తుంది. మగ వారికి వీర్య కణాల వృద్ధితో పాటూ, దంతస్రావం, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసనను తగ్గించేందుకు చక్కగా వుపయోగపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com