సాయి ధరంతెజ్ - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో కొత్త చిత్రం

- April 30, 2016 , by Maagulf

సాయిధరమ్‌తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా గోపిచంద్‌ మల్లినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించినట్లు కథానాయకి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు వి.వి. వినాయక్‌ చిత్రానికి క్లాప్‌ కొట్టారు. అల్లు అరవింద్‌, శ్రీను వైట్ల, చోటా కె. నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com