లాంఛనంగా ప్రారంభం కాబోతున్న నాని కొత్త సినిమా.!
- January 30, 2023
నేచురల్ స్టార్ నాని వేగం పెంచాడు. ఆల్రెడీ ‘దసరా’ సినిమాని పూర్తి చేసేసిన నాని, గ్యాప్ తీసుకోకుండా కొత్త ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేయనున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నాని కొత్త సినిమా షురూ అయ్యింది.
ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. కాగా, ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా రానున్నారనీ తెలుస్తోంది.
‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానితో జత కడుతోంది. తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని వైరా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిస్తున్నారు. నాని డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. మొన్నా మధ్య రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







