రామ్ చరణ్ స్వీట్ వార్నింగ్: ఎవరికో తెలుసా.?
- January 30, 2023
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి మూవీ ‘వాల్తేర్ వీరయ్య’ ఘన విజయం సాధించడంతో, ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ‘వీరయ్య విజయ విహారం’ అంటూ సాగిన ఈ ఈవెంట్‌కి వరంగల్ వేదికైంది. కాగా, ఈ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
‘వాల్తేర్ వీరయ్య’తో నాన్నకు ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు వీరయ్య టీమ్‌కీ, అభిమానులకూ ధన్యవాదాలు తెలిపారు రామ్ చరణ్. ఆ తర్వాత నాన్నగారు చాలా సౌమ్యులు. కానీ, ఒక్కసారి బిగించి గట్టిగా మాట్లాడారంటే అది వేరే లెవల్‌లో వుంటుంది.
నాన్నగారు సైలెంట్‌గా వున్నారు. కానీ, ఆయన వెనకున్న అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ కామ్‌గా వుండే అవకాశమే లేదు. ఆయన సైలెంట్‌గా వున్నారని ఎవరి నోటికొచ్చినట్లు వాళ్లు మాట్లాడితే ఊరుకోం.. ఇది సౌమ్యంగా ఇస్తున్న స్వీట్ వార్నింగ్.. అంటూ ఈ మధ్య మెగా ఫ్యామిలీపై అవాకులు చవాకులు పేలుతున్న వారికి గట్టి వార్నింగే ఇచ్చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







