BIC F1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ GP 2023:30-రోజుల కౌంట్‌డౌన్‌ ప్రారంభం

- January 30, 2023 , by Maagulf
BIC F1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ GP 2023:30-రోజుల కౌంట్‌డౌన్‌ ప్రారంభం

బహ్రెయిన్: రేసింగ్ అభిమానుల కోసం బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 ఓపెనింగ్ రౌండ్ మరో 30-రోజులలో వచ్చేస్తోంది. ఈ మేరకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. F1 సీజన్-ఓపెనింగ్ రౌండ్ మార్చి 3 నుండి 5 వరకు సఖిర్‌లోని "ది హోమ్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్ ఇన్ ది మిడిల్ ఈస్ట్"లో జరుగుతుంది. మార్చి 2 నుండి సర్క్యూట్ ప్రారంభం కానుండగా.. మూడు రోజుల టిక్కెట్ హోల్డర్‌లు పిట్-లేన్ వాక్‌లో వీక్షణను ఆస్వాదించవచ్చు. ప్రధాన ఈవెంట్ ఆన్-ట్రాక్ యాక్షన్ మార్చి 3న ప్రారంభమవుతుంది. 57-ల్యాప్‌ల బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ మార్చి 5న జరగనుంది. వారాంతం అంతా నాన్‌స్టాప్ రేసింగ్ సందడి చేయనుంది. టైమ్‌టేబుల్ ప్రకారం.. FIA ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్, FIA ఫార్ములా 3 ఛాంపియన్‌షిప్, పోర్షే స్ప్రింట్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్ రేసులు రేసింగ్ అభిమానులను అలరించనున్నాయి. F2, F3 బహ్రెయిన్‌లో తమ సంబంధిత 2023 సీజన్‌ల మొదటి రౌండ్‌లను నిర్వహిస్తుండగా, BIC-ఆధారిత పోర్షే స్ప్రింట్ ఛాలెంజ్  2022/2023 ప్రచారంలో ఐదవ, చివరి క్యాంపెయిన్ ను నిర్వహిస్తుంది. కార్నివాల్ రైడ్‌లు, రోమింగ్ యాక్ట్‌లు, స్టేజ్ షోలు, పిల్లల కార్యకలాపాలు, మల్టీ-ప్లాటినం-సెల్లింగ్ ఆర్టిస్ట్ DJ స్నేక్ అద్భుతమైన లైవ్ పెర్ఫార్మెన్స్‌తో సహా అన్ని రకాల ఈవెంట్లను రేస్-గోయర్లు ఆస్వాదించవచ్చు.  ఇప్పటికే నిర్వహించిన BIC ఎర్లీ బర్డ్ ఆఫర్‌లు మునుపటి సంవత్సరాలతో పోల్చితే అత్యుత్తమ విక్రయాలను నమోదు చేశాయి. BIC కార్పొరేట్ లాంజ్‌లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com