యూఏఈ వెదర్ అప్డేట్: మేఘావృతమై.. ధూళి, పొగమంచు వచ్చే అవకాశం
- February 02, 2023
యూఏఈ: వాతావరణం పాక్షికంగా మేఘావృతమై, ధూళిగా ఉంటుందని, పొగమంచు వచ్చే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) అంచనా వేసింది. ముఖ్యంగా రాత్రి సమయంలో, తెల్లవారుజామున తేమ అధికంగా ఉంటుందని తెలిపింది. కొన్ని తీరప్రాంతాలు, అంతర్గత ప్రాంతాలలో పొగమంచు భారీగా ఏర్పడ వచ్చని పేర్కొంది. తేలికపాటి నుండి మోస్తరు చల్లని గాలులు వీస్తాయని ఎన్సీఎం వెల్లడించింది. అబుధాబిలో గరిష్ట ఉష్ణోగ్రత 28°C, దుబాయ్‌లో 29°C ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఎమిరేట్స్‌లో వరుసగా 17°C, 18°C కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఎన్సీఎం తెలిపింది. అరేబియా గల్ఫ్ ప్రాంతం ఉత్తరం నుండి వచ్చే చల్లని గాలుల కారణంగా ఫిబ్రవరి నెలంతా సాధారణంగా ఉష్ణోగ్రతలు పడిపోతూనే ఉంటాయని తన నివేదికలో ఎన్సీఎం పేర్కొంది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







