బహ్రెయిన్ – ఖతార్ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం!
- February 02, 2023
బహ్రెయిన్ : 2017 తర్వాత మొదటిసారిగా బహ్రెయిన్ - ఖతార్ మధ్య విమాన సర్వీసులు త్వరలో పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి మహ్మద్ అల్ కాబీ తెలియజేశారు. ఇరు దేశాల పౌర విమానయాన అధికారుల మధ్య సంప్రదింపుల మేరకు ఒప్పందం కుదిరిందని ఆయన నిన్న పార్లమెంటు సమావేశంలో ఎంపీలతో చెప్పారు. మిస్టర్ అల్ కాబీ మాట్లాడుతూ.. ప్రాంతీయంగా, మరిన్ని విదేశాలకు కొత్త విమానాలను ప్రవేశపెట్టే ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి బహ్రెయిన్ నుండి 72 వాణిజ్య, కార్గో ఎయిర్‌లైన్స్ పని చేస్తున్నాయని, 2025 నాటికి 100కి చేరుకోవడం తమ లక్ష్యమన్నారు. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఇరు దేశాల పౌరుల ఆకాంక్షలను సాధించేందుకు 'సోదర దేశం ఖతార్'తో పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని హిస్ మెజెస్టి కింగ్ హమద్ స్పష్టం చేశారు. ఖతార్ అమీర్ షేక్ తమీన్ బిన్ హమద్ అల్ థానీతో హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మధ్య గత వారం ఫోన్ సంభాషణ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!