మరో కొత్త దర్శకుడికి ఛాన్సిచ్చిన కింగ్ నాగార్జున.!
- February 03, 2023
కొత్త దర్శకులతో సినిమాలు చేస్తే, ఎనర్జిటిక్‌గా వుంటుందనీ, ట్రెండీ కంటెంట్ వస్తుందనీ విశ్వసించే హీరోల్లో నాగార్జున మొదటి స్థానంలో వుంటారు. అలా కింగ్ ద్వారా చాలా మంది యువ దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
తాజాగా ఆయన మరో యంగ్‌స్టర్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. రచయితగా మంచి ఎక్స్‌పీరియన్స్ వున్న ప్రసన్న కుమార్ బెజవాడకు నాగార్జున ఛాన్సిచ్చాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ధమాకా’ సినిమాకి రచయితగా పని చేశాడీ ప్రసన్నకుమార్.
ఓ డిఫరెంట్ స్టోరీతో నాగార్జునను ఇంప్రెస్ చేశాడట ఈ కుర్ర రచయిత. దాంతో, సినిమా వర్కవుట్ చేద్దామని మాటిచ్చాడట నాగ్. ఈ నెలలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి రెగ్యలర్ షూట్ మొదలు పెట్టనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ పేరు ప్రచారంలో వుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







