మొబైల్ ఫోన్‌కు మంటలు.. సౌదీ యువతికి గాయాలు
- February 04, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలోని నార్తర్న్ బోర్డర్ రీజియన్‌లో మొబైల్ ఫోన్ చార్జింగ్ అవుతుండగా మంటలు చెలరేగి 13 ఏళ్ల బాలికకు కాలిన గాయాలు అయ్యాయి. రాఫా గవర్నరేట్‌లో బాలిక మొబైల్‌ని ఛార్జర్‌కి కనెక్ట్ చేసి ఫోన్ ని చేతిలో పట్టుకుని నిద్రపోయింది. బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ కాలిపోవడం చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే యువతిని రఫా సెంట్రల్ హాస్పిటల్‌లోని అత్యవసర గదికి తీసుకెళ్లారు. తన కుమార్తె తన మొబైల్ ఫోన్‌ను ఛార్జర్‌కు కనెక్ట్ చేసి పడుకుందని, అది పేలి మంటలు చెలరేగాయని తండ్రి వెల్లడించాడు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







