మాజీ భార్యకు BD10,600 తిరిగి ఇవ్వాలని భర్తను ఆదేశించిన కోర్టు

- February 04, 2023 , by Maagulf
మాజీ భార్యకు BD10,600 తిరిగి ఇవ్వాలని భర్తను ఆదేశించిన కోర్టు

బహ్రెయిన్: BD10,600 పిల్లల విద్యా ఖర్చుల నిధిని తన వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకున్న ఓ తండ్రికి కాసేషన్ కోర్టు షాకిచ్చింది. తన మాజీ భార్యకు BD10,600లను తిరిగి ఇవ్వమని కాసేషన్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. విడిపోయిన తర్వాత డబ్బు గురించి తెలుసుకున్న మాజీ భార్య కోర్టులో దావా వేసింది. అయితే, ఆ డబ్బును పిల్లల చదువుల ఖర్చుల కోసం ఉపయోగించినట్లు మాజీ భర్త కోర్టులో పేర్కొన్నాడు. కాగా కోర్టు వాటిని కోరినప్పుడు అతను తన వాదనలను రుజువు చేసే పత్రాలను సమర్పించడంలో విఫలమయ్యాడు. పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుండి తరగతులు తీసుకుంటున్నారని కోర్టు గుర్తించింది. సెప్టెంబరు 2, 2020న తమ వివాహాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత వారి జాయింట్ ఖాతాలో తాను జమ చేసిన డబ్బును తిరిగి ఇవ్వమని తన మాజీ భర్తను అభ్యర్థించినట్లు మాజీ భార్య తన పిటిషన్ లో పేర్కొంది. ఆ డబ్బును ఆ వ్యక్తి తమ పిల్లల చదువుల కోసం ఉపయోగించాల్సి ఉందని, అయితే అలా చేయడంలో విఫలమయ్యాడని మాజీ భార్య లాయర్ కోర్టుకు తెలిపారు. వారి వాదనలను సమర్థించిన కోర్టు ఆ డబ్బును తిరిగి ఇవ్వమని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com