నయన్-విఘ్నేష్.! ‘ఆ’ కహానీలు మొదలైపోయాయ్‌గా.!
- February 05, 2023
ఇదిగో తోక అంటే అదిగో పులి.. అన్న చందంగా మారింది పరిస్థితి. పెళ్లి అనే వార్త తెలిసిందంటే చాలు.. పక్కనే బ్రేకప్ అంటున్నారు. మొన్నీ మధ్యనే నయన తార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే.
సంచలన విషయంగా మీడియాలో స్థానం దక్కించుకున్న ఈ న్యూస్ ఇప్పుడు మరో సంచలనానికి కారణమైంది. ఇంకేముంది.. పెళ్లి తర్వాత వచ్చేది అదే.. బ్రేకప్. ఎస్.! నయన్, విఘ్నేష్ విడిపోతున్నారట.
అసలు మ్యాటర్ ఏంటంటే, పెళ్లికి ముందే చాలా క్రేజీ ప్రాజెక్టుల మీద నయన తార సైన్ చేసింది. అవన్నీ పూర్తి చేయాల్సి వుంది. ఆ కారణంగానే షూటింగులతో బిజీ కానుందట. విదేశాలకు కూడా వెళ్లాల్సి వస్తుందట. ఆ కారణంగానే కొన్నాళ్లు ఈ జంట దూరంగా వుండబోతున్నారనీ తెలుస్తోంది.
వైవాహిక బంధం నుంచి కాదు.. వృత్తి పరంగా తాత్కాలికంగా దూరంగా వుండడాన్ని కూడా వైరల్ చేస్తే ఏమనాలి.? ఇదంతా సోషల్ మీడియా పైత్యంలెండి.
రీసెంట్‌గా తెలుగులో ‘గాడ్ ఫాదర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార, ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమాలో నటిస్తోంది. ఇదే తొలి బాలీవుడ్ చిత్రం నయన్‌కి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష