కళ్యాణ్ రామ్ బ్రదర్ సెంటిమెంట్.! ‘అమిగోస్’కీ ఆపాదిస్తాడా.?
- February 05, 2023
గతేడాది ‘బింబిసార’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్, ఇప్పుడు ‘అమిగోస్’ సినిమాతో రాబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ఫస్ట్‌లుక్ నుంచీ అమితంగా ఆసక్తి పెంచేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక, వెరీ లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ‘అమిగోస్’తో కళ్యాణ్ రామ్ లిస్టులో మరో హిట్టు పక్కా అని ఫిక్స్ అయిపోయారు.
అందులోనూ మైత్రీ మూవీస్ బ్యానర్లో వస్తున్న సినిమా కావడంతో, పాజిటివ్ వైబ్స్ బాగున్నాయ్. కాగా, ఈ నెల 5 వ తేదీన జరగబోయే ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తమ్ముడు తారక్‌ని ముఖ్య అతిథిగా తీసుకురావాలనుకుంటున్నాడట కళ్యాణ్ రామ్. ‘బింబిసార’కు తారక్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్. అదే సెంటిమెంట్ ఇప్పుడు ‘అమిగోస్’కీ ఫాలో చేస్తున్నాడనుకుంటున్నారు. అయితే, ఈ మధ్య ఏ విషయంలోనైనా తారక్, కళ్యాణ్ రామ్ కలిసి మెలిసి మెలుగుతున్నారు. అన్న అడిగితే ఏంటీ. అడగకపోయినా తమ్ముడు తారక్ వస్తాడు. అన్నట్లు ఎన్టీయార్ తదుపరి చేయబోయే సినిమా నిర్మాణంలోనూ కళ్యాణ్ రామ్ భాగస్వామి కూడా.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష