దుబాయ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ హాలిడే డెస్టినేషన్‌

- February 06, 2023 , by Maagulf
దుబాయ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ హాలిడే డెస్టినేషన్‌

దుబాయ్: ప్రపంచంలోనే అత్యుత్తమ హాలిడే డెస్టినేషన్‌ అయిన దుబాయ్ అందుకు తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ (DET)  తాజా నివేదిక ప్రకారం.. 2022లో 14.36 మిలియన్ల మంది సందర్శకులు దుబాయ్ ని సందర్శించారు. 2021లో ఈ సంఖ్య 7.28 మిలియన్లు మాత్రమే కావడం గమనార్హం.  2022లో సగటు హోటల్ ఆక్యుపెన్సీ 73 శాతంగా(2021లో 67 శాతం) ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.  2019లో మహమ్మారి వ్యాప్తి కంటే ముందు కాలంలో 75 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. ఇటీవల ట్రిప్యాడ్వైజర్ ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్ 2023లో వరుసగా రెండో సంవత్సరం కూడా దుబాయ్ నంబర్ 1 గ్లోబల్ డెస్టినేషన్‌గా ర్యాంక్ పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మాట్లాడుతూ.. పర్యాటకుల అసాధారణమైన పెరుగుదల ప్రపంచంలోని అత్యంత అనుసంధానిత నగరాలలో ఒకటిగా దుబాయ్ నిరంతర పెరుగుదలను ప్రతిబింబిస్తుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ పర్యాటకం, ప్రయాణ కనెక్టివిటీ వృద్ధికి దుబాయ్ మరింత గొప్ప ఉత్ప్రేరకం అవుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com