దుబాయ్‌లో ఆకట్టుకుంటున్న ఎతిహాద్ రైలు

- February 06, 2023 , by Maagulf
దుబాయ్‌లో ఆకట్టుకుంటున్న ఎతిహాద్ రైలు

యూఏఈ: దుబాయ్‌లోని అల్ ఖుద్రా ప్రాంతంలో రైలు పట్టాలపై టెస్టింగ్ రైడ్ చేస్తున్న ఎతిహాద్ ప్యాసింజర్ రైళ్లు పౌరులు, నివాసితులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  గత రెండు లేదా మూడు రోజులుగా ట్రాక్‌పై ప్యాసింజర్ రైళ్లను చూస్తున్నట్లు అల్ ఖుద్రా సమీపంలోని న్షామా టౌన్‌హౌస్‌ల నివాసి జమాక్షరీ జుబైర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది చాలా ఆకట్టుకునేలా కనిపిస్తోందన్నారు. ఎతిహాద్ రైలు పట్టాలపై వెళుతుండగా చూసి ఆనందిస్తున్నట్లు అల్ ఖుద్రా ప్రాంతం చుట్టూ ఉన్న కమ్యూనిటీలలో(రెమ్‌రామ్, ముడోన్, మీరా, టౌన్ స్క్వేర్) నివసిస్తున్న నివాసితులు తెలిపారు.  “తాను భారతదేశంలో రైళ్ల శబ్దాన్ని వినడం అలవాటు. తాను నా కాలేజీ హాస్టల్‌లో నివసిస్తున్నప్పుడు ఉదయం 7.30 గంటలకు రైళ్ల శబ్దాలు వినబడేవి. అప్పటి నుంచి రైళ్ల శబ్దాలను వినడం తనకు హాయినిస్తుంది.” అని ముడోన్‌లోని అరబెల్లా నివాసి ఫౌద్ అష్రఫ్ తెలిపారు.

అబుధాబిలో జరిగిన 51వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎతిహాద్ ప్యాసింజర్ రైలును ప్రదర్శించారు. గత ఏడాది డిసెంబర్‌లో అబుధాబిలో జరిగిన పురాణ వేడుకల సందర్భంగా ప్యాసింజర్ రైలు మొదటి నమూనాను ఆవిష్కరించారు. 1200 కిలోమీటర్ల పొడవైన ఎతిహాద్ రైలు ప్రాజెక్ట్ మొత్తం ఏడు ఎమిరేట్స్ , 11 ప్రధాన నగరాలను సౌదీ అరేబియాతో కులపుతుంది. యూఏఈ సరిహద్దు నుండి ప్రారంభించి ఒమన్‌తో దేశ సరిహద్దు వరకు ఈ రైల్ నెట్ వర్క్ ఉంది. గత సంవత్సరం, అబుధాబి- దుబాయ్‌లను 256 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది.  కొత్త లైన్ ప్రారంభమైతే ప్రయాణ సమయం 30-40 శాతం తగ్గుతుంది. అబుధాబి నుండి దుబాయ్, దుబాయ్ నుండి ఫుజైరాకు ప్రయాణ సమయం 50 నిమిషాలు మాత్రమే పడుతుందని ఎతిహాద్ రైల్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com