అఖిల్ ప్రోమోపై సమంత రెస్పాన్స్.!
- February 06, 2023
అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ లేటెస్ట్గా డేట్ ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 28న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్లు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పోటీగా ‘ఏజెంట్’ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారానికి చెక్ పెట్టేస్తూ తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దీంతో పాటూ, ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ‘వైల్డ్ సాలే..’ అంటూ అఖిల్ తన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్గా వుండబోతోందో.. ఈ ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పేశాడు.
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, తాజా ప్రోమోకి సమంత సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యింది.
‘బీస్ట్ మోడ్ ఆన్..’ అంటూ ఈ ప్రోమోకి తన రెస్పాన్స్ ఇచ్చింది సమంత. చైతూతో విడాకుల అనంతరం, అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఏ సినిమా విషయంలోనూ రెస్పాండ్ కాని సమంత, తాజాగా అఖిల్ సినిమాపై రెస్పాండ్ అవ్వడం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!