'డిజిటల్ వాలెట్'గా బీఅవేర్ బహ్రెయిన్ మొబైల్ యాప్

- February 06, 2023 , by Maagulf
\'డిజిటల్ వాలెట్\'గా బీఅవేర్ బహ్రెయిన్ మొబైల్ యాప్

బహ్రెయిన్: బీఅవేర్ బహ్రెయిన్ మొబైల్ యాప్ అప్‌డేట్ వెర్షన్‌ను ది ఇన్పర్మేషన్ అండ్ ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA)  విడుదల చేసింది. యాప్‌ను డిజిటల్ వాలెట్‌గా మార్చే ప్రణాళికల్లో ఇది భాగమని ప్రకటించింది. ఇందులో వ్యక్తిగత పత్రాలైన ఆల్ ఇన్ వన్ యాప్ కారు యాజమాన్య పత్రాలతో పాటు సీపీఆర్, పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్ ఇ-కాపీలను భద్రపరుచుకోవచ్చు. అధికారికంగా వీటిని గుర్తిస్తారు. అలాగే ఆరోగ్యం, మై మెడికల్ అపాయింట్ మెంట్స్, నా ఆరోగ్య కార్డ్‌లకు సంబంధించిన ఫీచర్‌ను త్వరలోనే జోడించనున్నట్లు ఐజీఏ  చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అలీ అల్ ఖైద్ తెలిపారు. రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ఆదేశాలతో, అథారిటీ పబ్లిక్ సంస్థల భాగస్వామ్యంతో కింగ్‌డమ్ ఇ-ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్‌లను అమలు చేసిందన్నారు. అధికారిక సంస్థలు అన్ని ఇప్పుడు ఇ-పత్రాలను అంగీకరిస్తాయని తెలిపారు. ప్రతి కాపీతో వచ్చే QR కోడ్‌ల ద్వారా పత్రాలను ధృవీకరించవచ్చని అల్ ఖైద్ చెప్పారు. భవిష్యత్తులో కొత్త ఫీచర్లు, కీలక సేవలతో కూడిన బీఅవేర్ యాప్‌ను అథారిటీ ప్రారంభిస్తుందని అలీ అల్ ఖైద్ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com