అబు కిర్‌తో జిపిఐసి అతి పెద్ద డీల్‌

- May 01, 2016 , by Maagulf
అబు కిర్‌తో జిపిఐసి అతి పెద్ద డీల్‌

గల్ఫ్‌ పెట్రో కెమికల్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ (జిపిఐసి), పలు కీలక ఒప్పందాల్ని ఈజిప్టియన్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెట్రో కెమికల్‌ జెయింట్‌, అబు కిర్‌ పెర్టిలైజర్స్‌ అండ్‌ పెట్రోకెమికల్‌ ఇండస్ట్రీస్‌తో కుదుర్చుకుంది. ట్రైనింగ్‌, డెవలప్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ రీసెర్చ్‌ వంటి అంశాలే కాకుండా, ఎక్స్‌పీరియన్స్‌ మరియు టెక్నికల్‌ ఎక్స్‌పర్టైజ్‌ను పరస్పర అవగాహనతో సమకూర్చుకోవడంపైనా ఈ ఈ ఒప్పందాలు జరిగాయి. జిపిఐసి ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ జవాహరి మరియు ఈజిప్టియన్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాద్‌ ఎల్‌ మాతి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. బహ్రెయిని ఈజిప్టియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సమావేశంలో ఈ నిర్ణయాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతంగా ఉన్నాయనీ, వాటిని మరింత బలోపేతం చేసేలా ఈ ఒప్పందాలు ఉపయోగపడ్తాయని ఇరు దేశాల ప్రతినిథులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com