ఒమన్‌లో 1.6 మిలియన్లు దాటిన వాహనాలు
- February 08, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన తాజా డేటా ప్రకారం.. డిసెంబర్ 2022 చివరి నాటికి ఒమన్ సుల్తానేట్‌లో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 1,603,376కి చేరుకుంది. ఒమన్‌లో నమోదైన మొత్తం వాహనాల్లో ప్రైవేట్ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలు 79.4 శాతం(1,273,791) ఉండగా.. వాణిజ్య రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల సంఖ్య 238,512(14.9 శాతంగా)కి చేరుకుంది. అదే సమయంలో అద్దె వాహనాలు 1.8 శాతంతో 28,633కి చేరాయి. టాక్సీ వాహనాల సంఖ్య 1.8 శాతంతో 28,117గా ఉంది. ప్రభుత్వ వాహనాల సంఖ్య (సైనిక వాహనాలు మినహాయించి) 12,167, మోటార్‌బైక్‌లు 6,765గా ఉన్నాయి. డ్రైవింగ్ సూచనల వాహనాల సంఖ్య 5,744 కాగా.. తాత్కాలిక రిజిస్ట్రేషన్ (తాత్కాలిక తనిఖీ, ఎగుమతి, దిగుమతి) కలిగిన వాహనాల సంఖ్య 7,528గా ఉన్నాయి. అంతేకాకుండా వ్యవసాయ ట్రాక్టర్ల సంఖ్య 1,280, దౌత్య సంస్థల రిజిస్ట్రేషన్లు కలిగిన వాహనాలు 839గా ఉన్నట్లు NCSI డేటాలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







