కింగ్ సల్మాన్ అధ్యక్షతన సౌదీ కేబినెట్ భేటీ
- February 08, 2023
రియాద్ : ఇర్కా ప్యాలెస్లో రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమాశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఇందులో ప్రధానంగా కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ అఫైర్స్ (సీఈడీఏ) నేషనల్ అవుట్పుట్ రివ్యూ వర్క్షాప్ వ్యూహాత్మక కమిటీ నిర్ణయాలు, అసైన్మెంట్లకు ఆమోదం తెలిపింది. అలాగే రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్తో ఉన్న విశిష్ట సంబంధాలను కేబినెట్ ప్రశంసించింది. ప్రజల కోసం స్థిరమైన వృద్ధి, శ్రేయస్సును సాధించడానికి ఇరాక్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సౌదీ అరేబియా మద్దతును పునరుద్ఘాటించింది. ఇది సౌదీ అరేబియా, అనేక ఇతర దేశాల మధ్య ఇటీవలి జరిగిన చర్చలను సమీక్షించింది. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన టర్కీ, సిరియా దేశాల ప్రజలకు సౌదీ అరేబియా కేబినేట్ సంఘీభావాన్ని తెలియజేసింది. రాష్ట్ర మంత్రి, షౌరా కౌన్సిల్ వ్యవహారాల కేబినెట్ సభ్యుడు, మీడియా తాత్కాలిక మంత్రి డాక్టర్ ఎస్సామ్ బిన్ సాద్ బిన్ సయీద్ మాట్లాడుతూ.. కేబినెట్ ప్రాంతీయ, అంతర్జాతీయ సమావేశాలకు సంబంధించిన అనేక నివేదికలపై చర్చిందన్నారు. సౌదీ అరేబియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ డిజిటల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (DCO) అధ్యక్షుడిగా 2030 వరకు నిర్వహించే పదవి, సాంకేతికత, డిజిటల్ ఆర్థిక రంగంలో రాజ్యం మార్గదర్శక పాత్రను హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







