ఏపీలో ఘోర ప్రమాదం…ఏడుగురి కార్మికుల మృతి
- February 09, 2023
కాకినాడ: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట మండలంలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేయడానికి లోపలకు దిగిన కార్మికులు ఒక్కొక్కరుగా మృతి చెందారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న ట్యాంకుల్ని శుభ్రం చేయడానికి వచ్చిన కార్మికులు ప్రమాదానికి గురయ్యారు.
ఉదయం ఆరుగంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్లు శుభ్రం చేయడానికి కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణకు వచ్చారు. పని ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. పాడేరుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరి అందకపోవడంతో లోపలకు జారిపోయాడు. అతడిని రక్షించేందుకు వచ్చిన నరసింహ, సాగర్లు కూడా అపస్మారక స్థితిలోకి చేరడంతో మిగిలిన వారు వారిని రక్షించేూందుకు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయారు.
మృతులను రామారావు, ప్రసాద్ జగదీష్, వెచ్చంగి సాగర్, బొంజుబాబు, వెచ్చింగి కృష్ణ, వెచ్చంగి నరసింహలుగా గుర్తించారు.మృతుల్లో ఐదుగురిది పాడేరుగా గుర్తించారు. మరో ఇద్దరు మృతులను పెద్దాపురం మండలం పులిమేరుగా వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఒకరికి ఇటీవల వివాహం జరిగినట్లు సహచరులు చెబుతున్నారు.
కంపెనీ యాజమాన్యం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు భారీ పరిణామంలో ఉన్న వంట నూనెల ట్యాంకర్లను శుభ్రం చేసే పనుల్ని పాడేరు, పులిమేరులకు చెందిన వారికి అప్పగించారు. ఒక్కో ట్యాంకర్ శుభ్రం చేయడానికి నిర్ణీత మొత్తం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయిల్ ట్యాంకర్లలో విషవాయువులు పేరుకు పోవడంతో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
ట్యాంకర్లలో ఆక్సిజన్ పరిణామాన్ని గుర్తించకుండా కార్మికుండా కార్మికుల్ని పనిలోకి పురమాయించడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాలతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాద స్థలానికి పెద్దాపురం పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో జగదీష్, ప్రసాద్ పులిమేరు గ్రామస్తులుగా గుర్తించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







