ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్ట్
- February 09, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబధించి ఈడీ దూకుడు పెంచింది. వరుసగా అరెస్ట్ ల పర్వం చేస్తూ వణుకు పుట్టిస్తున్నారు. దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం బుచ్చిబాబును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు వెంటనే అతన్ని ఢిల్లీ తరలించారు. ఇది జరిగిన కాసేపటికే మరొకర్ని సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో గౌతమ్ మల్హోత్రాను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన బ్రికంక్ కో సేల్స్ సంస్ధకు డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు.ఒకేరోజు ఇద్దరి అరెస్ట్‌లతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మరింత స్పీడ్ చేసినట్లు అర్ధమవుతుంది. గురువారం మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు.
చారియట్ మీడియాకు చెందిన రాజేష్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూపునకు రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ ఈ డబ్బును ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజేష్ జోషిని సీబీఐ అధికారులు కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఢిల్లీకి చెందిన రాజేష్ జోషి నగదు బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నగదును ఢిల్లీకి తరలించారని గుర్తించారు. ఇక ఇప్పటివరకు ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







