టర్కీ-సిరియాలో 11,300 దాటిన మృతుల సంఖ్య..ఇండియా ఆసుపత్రి ప్రారంభం

- February 09, 2023 , by Maagulf
టర్కీ-సిరియాలో 11,300 దాటిన మృతుల సంఖ్య..ఇండియా ఆసుపత్రి ప్రారంభం

కువైట్: టర్కీ, సిరియాలో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది.  భూకంపంలో మరణించిన వారి సంఖ్య 11,376 దాటింది. టర్కీలో కనీసం 8,574 మంది మరణించారని, దాదాపు 50,000 మంది గాయపడ్డారని, 6,444 భవనాలు కూలిపోయాయని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. సోమవారం నాటి భూకంప కేంద్రానికి సమీపంలోని విపత్తు ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సిరియాలో మొత్తం మరణాల సంఖ్య 2802కి చేరుకుంది. వాయువ్య ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 1,540 మరణాలు నమోదయ్యాయని సీఎన్ఎన్ వెల్లడించింది.

కాగా, భూకంపంతో అతలాకుతలమైన టర్కీ ప్రజలకు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ తెలిపారు. ఆపరేషన్ ‘దోస్త్’లో భాగంగా టర్కీలో నాలుగు బృందాలు పని చేస్తున్నాయని, ఇందులో రెండు రెస్క్యూ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు, రెండు వైద్య బృందాలు ఉన్నాయని చెప్పారు. భారత్ ఇప్పటికే టర్కీలో ఫీల్డ్ హాస్పిటల్‌ను ప్రారంభించిందని ఆయన చెప్పారు.భారతదేశం ఇప్పటికే నాలుగు బృందాలను NDRF రెండు రెస్క్యూ బృందాలు, వైద్య సహాయం కోసం రెండు బృందాలను పంపిందన్నారు. నేడు NDRF మూడవ బృందం డాగ్ స్క్వాడ్, మందులు, దుప్పట్లు, నాలుగు చక్రాల వాహనాలతో పాటు టర్కీకి బయలుదేరుతోందని మురళీధరన్ ఏఎన్ఐతో చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com