ఒమన్‌లో ఏడు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు
- February 09, 2023
మస్కట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైర్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ రూపొందించిన గణాంకాల ప్రకారం.. మానవ అక్రమ రవాణాలో ఒమన్ సుల్తానేట్ నేర స్థాయి చాలా తక్కువగా ఉందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్‌లో హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అధిపతి కెప్టెన్ ఖలీద్ బిన్ అలీ తబుక్ వెల్లడించారు. 2022లో రాయల్ ఒమన్ పోలీస్‌లో ఈ తరహా కేసులు 7 నమోదయ్యాయని, వివిధ గవర్నరేట్‌ల నుంచి మానవ అక్రమ రవాణాపై అనుమానాలపై డిపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 266 కంటే ఎక్కువగా ఉన్నాయని, అందులో 7 నేరాలు మాత్రమే రుజువయ్యాయని కెప్టెన్ ఖలీద్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా నేరాలు ప్రపంచంలో మూడవ అతిపెద్ద నేరంగా ఉందని, దానికంటే ముందు ఆయుధాల వ్యాపారం, మాదకద్రవ్యాల వ్యాపారాలు ఉన్నాయన్నారు. గ్లోబల్ స్థాయిలో ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించబడే రహస్య వ్యవస్థీకృత నేరాలలో ఇది ఒకటని, దానిని ఎదుర్కోవడానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కెప్టెన్ ఖలీద్ తెలిపారు. మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి సంబంధించిన అంతర్జాతీయ, ప్రాంతీయ ఒప్పందాల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ పని చేస్తందన్నారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







