హిట్ అండ్ రన్: మూడు గంటల్లో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
- February 10, 2023
యూఏఈ: 72 ఏళ్ల వ్యక్తిని కారుతో ఢీకొట్టి పారిపోయిన 26 ఏళ్ల అరబ్ వాహనదారుడిని కేవలం మూడు గంటల్లోనే రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఆపరేటింగ్ రూమ్‌కు గురువారం ఉదయం 5.55 గంటలకు నివాస ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు నివేదిక అందింది. అధికార యంత్రాంగం వెంటనే పోలీసు పెట్రోలింగ్, జాతీయ అంబులెన్స్ బృందాలను ప్రమాద స్థలానికి చేరుకోగా.. అప్పటికే బాధితుడు గాయాలతో మరణించాడు. చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి బృందం మృతుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాలపై విచారణ జరిపి హిట్ అండ్ రన్ డ్రైవర్‌ను పట్టుకునేందుకు వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాద స్థలంలో ఉన్న నిఘా కెమెరాలు నిందితుడు ఏ దిశలో పారిపోయారో గుర్తించడానికి, ప్రమాద జరిగిన తీరును తెలుసుకునేందుకు పరిశోధకులకు సహాయపడింది. నివేదిక అందిన మూడు గంటల్లోనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అరబ్ వ్యక్తిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి బదిలీ చేయడానికి చట్టపరమైన చర్య తీసుకోవడానికి ప్రత్యేక అధికారులకు రిఫర్ చేశారు. ఏదైనా ట్రాఫిక్ ప్రమాదం గురించి తెలియజేయాలని ప్రజలను రస్ అల్-ఖైమా పోలీస్ జనరల్ హెడ్‌క్వార్టర్స్ కోరింది. ఇలాంటి దురదృష్టకర ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు వాహనదారులు జాగ్రత్తగా నడపాలని, నివాస ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం కోరింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







