కొచ్చి విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
- February 09, 2023
కేరళ: రియాద్ నుంచి వచ్చిన ఓ మహిళ కొచ్చిలోని నెడుంబస్సేరి విమానాశ్రయంలో దిగింది.విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లే సమయంలో గ్రీన్ ఛానల్ గుండా వెళ్లేందకు ప్రయత్నించడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించారు.ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలని అధికారులు కోరారు.దీంతో ఆమె బదులిస్తూ.. తాను పీరియడ్స్‌లో ఉన్నానని ఫిజికల్ టెస్ట్‌కు సహకరించనని తెలిపింది.అయితే ఆమె మాటలు నమ్మని మహిళా అధికారులు పరీక్షించగా..ఆమె రహస్య ప్రాంతంలో ఐదు బంగారు బిస్కెట్లను దొంగతనంగా తీసుకొచ్చింది. ఈ బంగారం ధర సుమారు రూ.30 లక్షలు.
అయితే ఈ సమయంలో ఆ మహిళ అధికారులను బురిడి కొట్టించడానికి కృత్రిమంగా రుతుక్రమాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది.బంగారాన్ని శానిటరీ న్యాప్కిన్‌లో దాచుకొని, రుతుక్రమం భావన కలిగేందుకు నాప్‌కిన్‌కు ఎరుపు రంగును అద్దింది.ఈ విషయం తెలిసిన అధికారులు ఒక్కసారిగా స్టన్ అయ్యారు.ఇక గోల్డ్ స్మగ్లింగ్ కోసం మరి ఇంత దిగజారడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







