ఒమన్‌లో మిస్క్‌ మై షాజా ప్రారంభం

- May 02, 2016 , by Maagulf
ఒమన్‌లో మిస్క్‌ మై షాజా ప్రారంభం


ఫైవ్‌ స్టార్‌ లగ్జరీ హోటల్‌ ఇండిపెండెంట్‌ ఆపరేటర్‌ - షాజా హోటల్స్‌, ఒమన్‌లో ఫోర్‌స్టార్‌ బ్రాండ్‌ మిస్క్‌ బై షాజాను ప్రారంభించింది. గత వారంలో దుబాయ్‌లో ఈ బ్రాండ్‌ని ప్రారంభించారు. 2017 మార్చ్‌లో మస్కట్‌లోని అల్‌ మౌజ్‌లో తొలి హోటల్‌ ప్రారంభమవుతుంది. సౌదీ అరేబియా, దుబాయ్‌లో చాలా అవకాశాలు ఈ రంగంలో ఉన్నాయనీ, షాజా బ్రాండ్‌పై ఫోర్‌ స్టార్‌ మార్కెట్‌ని విస్తరిస్తామని షాజా హోటల్స్‌ సీఈఓ సిమన్‌ కూంబ్స్‌ తెలిపారు. మిస్క్‌ మై షాజాకి రీజియన్‌లో మరో మూడు డీల్స్‌ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. 2016, 2017 తమ గ్రూప్‌కి అత్యంత కీలకమని, షాజా హోటల్స్‌, మిస్క్‌ బై షాజా ద్వారా తమ కార్యకలాపాల్ని విస్తరించనున్నామని చెబుతూ, 2016లో మక్కాలో షాజా హోటల్‌ని స్థాపిస్తామనీ, యూరోపణలోనూ, మిడిల్‌ ఈస్ట్‌లో మరికొన్ని చోట్ల హోటల్స్‌ ఏర్పాటు చేస్తామని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com