ఏపీ సీఎం జగన్ నివాసం పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రత
- February 11, 2023
అమరావతి: సిఎం జగన్ నివాస ప్రాంతంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 1000 మంది సీఎం నివాసం వైపు వస్తారన్న సమాచారం అందడంతో భారీగా పోలీసులను మోహరించారు. అంతేకాకుండా.. తాడేపల్లి వైపు వస్తున్న అభ్యర్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొన్ని రోజులుగా వారు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించని వారికి మరో ఐదు మార్కులు కలిపితే క్వాలిఫై అవుతారనేది అభ్యర్థుల డిమాండ్. ఈ మేరకు సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు అభ్యర్థులు నేడు తాడేపల్లిల్లోని సీఎం నివాసానికి వచ్చేందుకు రెడీ అయ్యారు.ఈ ఏడాది జనవరి 22న జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు నాలుగున్నర లక్షల పైచిలుకు అభ్యర్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడగా..99 వేల మంది క్వాలిఫై అయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







