బిగ్ టిక్కెట్ డ్రాలో భారతీయ ప్రవాసికి మళ్లీ అదృష్టం...

- February 11, 2023 , by Maagulf
బిగ్ టిక్కెట్ డ్రాలో భారతీయ ప్రవాసికి మళ్లీ అదృష్టం...

అబుధాబి: ఖతార్‌లో ఉండే ఈ భారతీయ ప్రవాసుడికి బిగ్ టికెట్ ర్యాఫిల్  బంపర్ ప్రైజ్‌లు గెలుచుకున్నాడు. రెండుల నెలల కింద బిగ్ టికెట్ ఎలక్ట్రానిక్ డ్రాలో 1కిలో గోల్డ్ గెలుచుకున్న మనోడు..తాజాగా నిర్వహించిన డ్రాలో విలువైన మోడ్రన్ కారు గెలుచుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్లే.. సుమన్ ముత్తయ్య నాడార్ రాగవన్ అనే భారత వ్యక్తి ఖతార్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో గడిచిన ఏడాదిన్నర కాలంగా మిత్రుల సలహా మేరకు క్రమం తప్పకుండా బిగ్ టికెట్  ర్యాఫిల్ లో పాల్గొంటున్నాడు.దీంతో గత ఏడాది  డిసెంబర్‌లో మనోడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది.ఏకంగా 1కేజీ గోల్డ్ గెలుచుకున్నాడు.మళ్లీ ఇప్పుడు మనోడికి మరోసారి అదృష్టం వరించింది.ఇటీవల అతడు కొన్న ఓ లాటరీకి తాజాగా నిర్వహించిన డ్రాలో రేంజ్ రోవర్  వచ్చింది.ఇలా రెండు నెలల వ్యవధిలోనే సుమన్ ముత్తయ్య బిగ్ టికెట్ ద్వారా రెండు బంపర్ ప్రైజ్‌లు కొట్టేశాడు.దీంతో మనోడి ఆనందానికి అవధుల్లేవు. మునుముందు కూడా ఇలాగే ప్రతినెల బిగ్ టికెట్ ర్యాఫిల్ లో పాల్గొంటూనే ఉంటానని చెప్పుకొచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com