నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం.. రామకృష్ణ కారుకి యాక్సిడెంట్..
- February 11, 2023
హైదరాబాద్: నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు స్వల్పగాయాలయ్యాయి.కానీ కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. చికిత్స అనంతరం ప్రస్తుతం రామకృష్ణ ఆరోగ్యంగానే ఉన్నారు.
అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.వరుసగా నందమూరి కుటుంబలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక గతంలో కూడా నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీరామ్లు కారు యాక్సిడెంట్స్లోనే కన్ను మూయడం, ఎన్టీఆర్ కి కూడా యాక్సిడెంట్ అవ్వడం..ఇప్పుడు నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ అవ్వడం.. ఇవన్నీ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు.
అయితే నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ గురించి కుటుంబం ప్రకటించలేదు. పోలీసులు కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు.యాక్సిడెంట్ కి గురైన కారుని కుటుంబ సభ్యులు తీసికెళ్ళిపోయారని సమాచారం.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







