కిడ్నీ స్టోన్స్‌కి తమలపాకుతో ఉపశమనం.!
- February 11, 2023
హిందువులకు పెళ్లయినా, పేరంటమైనా, ఏ పూజ జరిగినా తమలపాకు వుండాల్సిందే. తమలపాకుకు హిందూ సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైన స్థానం వుంది.అందుకే తమలపాకును పవిత్రమైన ఆకుగా భావిస్తుంటారు.కేవలం పూజా ద్రవ్యంగానే కాదండోయ్ తమలపాకు ఎన్నో అనారోగ్య సమస్యలకు ఔషధంగానూ పని చేస్తుంది.
ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవాళ్లకు తమలపాకు మంచి ఔషధం.
యూరిక్ యాసిడ్ సమస్య కారణంగా రక్తంలో మలినాలు ఏర్పడి, తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కీళ్ల నొప్పులు బాధిస్తాయి. అలాగే మూత్ర పిండాల సమస్య కూడా తలెత్తుతుంది..
యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడాన్ని ఇంగ్లీష్ పరిభాషలో హైపర్ యూరిసెమియా అంటారు. మెడిసెన్‌లో దీనికి రకరకాల మందులూ, సర్జరీలు అందుబాటులో వున్నప్పటికీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అంటారు కదా.. అలా ఈ సమస్య తలెత్తకుండా వుండాలంటే రోజూ ఓ తమలపాకు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించేందుకు తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుందట. అయితే ధూమపానం చేసేవారు తమలపాకును విడిగా నమలకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







