టీ20 మహిళా వరల్డ్ కప్.. రేపే ఇండియా-పాక్ మ్యాచ్
- February 11, 2023
కేప్ టౌన్: ‘ఐసీసీ టీ20 మహిళా వరల్డ్ కప్-2023’ శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో ఆదివారం కీలక మ్యాచ్ జరగబోతుంది.టీమిండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కేప్ టౌన్ లో జరగనుంది. ‘గ్రూప్-బి’లో ఉన్న ఇండియా-పాక్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం 06.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న స్మృతి మంధాన ఆడటం అనుమానంగా ఉంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌లో ఆడుతుందా లేదా అని అనుమానం తలెత్తుతోంది. జట్టు కూర్పు గురించిన వివరాల్ని బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిత్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నరని, అయితే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం మ్యాచ్‌లో ఆడకపోవచ్చన్నారు. వేలికి తగిలిన గాయం కారణంగా స్మృతి మ్యాచ్‌కు దూరం కావొచ్చన్నారు. కనిత్కర్ చెప్పిన వివరాల ప్రకారం.. స్మృతి మంధాన ప్రస్తుతం కోలుకుంటోంది. ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో స్మృతి ఆడే అవకాశం ఉంది.
కెప్టెన్ హర్మన్ కూడా జట్టుతో ఆడేందుకు సిద్ధమవుతోంది. రెండు రోజులుగా హర్మన్ బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచుల్లో గాయం కారణంగా హర్మన్ ప్రీత్ కౌర్ ఆడలేదు. దీంతో పాకిస్తాన్ మ్యాచులో ఆడుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి గతంలో పాకిస్తాన్‌తో ఆడిన అనుభవం ఉంది. దీంతో ఈ అనుభవంతో భారత ఆటగాళ్లు పై చేయి సాధించే అవకాశం ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లతో తదుపరి మ్యాచులు ఆడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







