ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ 2023: ఇద్దరు భారతీయ మహిళా వ్యాపారవేత్తలకు చోటు
- February 12, 2023
కువైట్: ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ 2023లో అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల వార్షిక జాబితాను వెల్లడించింది. మధ్యప్రాచ్యం, వెలుపల వ్యాపార విజయాన్ని సాధించిన మహిళకు ర్యాంకులు ఇచ్చింది. వ్యాపారం పరిమాణం, వ్యక్తి ప్రభావం, విజయాలు, గత సంవత్సరంలో పనితీరు, CSR పరిధి, వ్యక్తి నేతృత్వంలోని ఇతర కార్యక్రమాల ఆధారంగా జాబితా రూపొందించబడింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో విజయవంతం అయిన ఎనిమిది మంది కువైట్ మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిలో ఫస్ట్ అబుధాబి బ్యాంక్ గ్రూప్ సీఈఓ హనా అల్ రోస్తమానీ, ఈసా సలేహ్ అల్ గుర్గ్ గ్రూప్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఈసా అల్ గుర్గ్ ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఎన్‌బికె డిప్యూటీ గ్రూప్ సిఇఒ షేఖా అల్-బహర్ 4వ స్థానంలో ఉన్నారు. కేఎన్‌పీసీ సీఈవో వాధా అల్ ఖతీబ్ 6వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో కిప్కో గ్రూప్ సీఈఓ డానా నాసర్ అల్ సబా 12వ స్థానంలో, ఎజిలిటీ చైర్‌పర్సన్ హెనాడి అల్-సలేహ్ 20వ స్థానంలో ఉన్నారు. జాబితాలో ఉన్న ఇతరులు జైన్ కువైట్ సీఈఓ ఇమాన్ అల్ రౌధన్ (22వ స్థానం), అహ్లీ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సీఈఓ జెహాద్ అల్-హుమైదీ (34వ స్థానం), నాడియా బాదర్ అల్-హజ్జీ - పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ సీఈఓ (PIC) (35వ స్థానం), CEO & యునైటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఏవియేషన్ సర్వీసెస్ కంపెనీ (UPAC) వైస్ చైర్మన్ నదియా అకిల్ (88వ)స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఇద్దరు భారతీయులు రేణుకా జగ్తియాని (ల్యాండ్‌మార్క్ గ్రూప్ అధ్యక్షురాలు), పూనమ్ భోజానీ (CEO - ఇన్నోవెంచర్స్ ఎడ్యుకేషన్) కూడా స్థానం దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







