టర్కీ, సిరియాలో పలువురిని రక్షించిన రెస్క్యూ టీమ్స్.. 24 వేలకు చేరిన మరణాలు
- February 12, 2023
యూఏఈ: టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతంలో భూకంపం వచ్చి ఐదు రోజులు దాటింది. కూలిపోయిన ఓఇంటిలో జీవించి ఉన్న ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని టర్కీలోని రెస్క్యూ బృందాలు శనివారం సురక్షితంగా రక్షించాయి. ఇప్పటివరకు భూకంపంలో మృతుల సంఖ్య 25,000కు చేరువైంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య ఆశలు తగ్గుతున్నప్పటికీ, 129 గంటల తర్వాత రెస్క్యూ టీమ్స్ తొమ్మిది మందిని కాపాడారు. వారిలో 16 ఏళ్ల అమ్మాయి, 70 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం కారణంగా వేలాది భవనాలు కూలిపోయి, 24,000 మందికి పైగా మరణించారు. మరో 80,000 మంది వరకు గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులు ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలరని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. శిథిలాల మధ్య జీవించి ఉన్నవారిని గుర్తించడంలో సహాయపడటానికి రెస్క్యూ టీమ్స్ థర్మల్ కెమెరాలకు వినియోగిస్తున్నారు. కాగా,ఇండియన్ ఆర్మీ వైద్య సహాయ బృందం నుండి 99 మంది సభ్యుల బృందం గాయపడిన వారికి దక్షిణ నగరంలోని ఇస్కెన్‌డెరున్‌లోని తాత్కాలిక ఫీల్డ్ హాస్పిటల్‌లో చికిత్సలు ప్రారంభించింది. అదే ప్రాంతంలో ఉన్న ఒక ప్రధాన ఆసుపత్రి భూకంపం ధాటికి కుప్పకూలింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







