పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..
- February 12, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం ప్రకటించింది.
ప్రస్తుతం ఏపీకి గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ను నియమించింది. ఇక బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమించారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఎస్.అబ్దుల్ నజీర్ జనవరి 4న రిటైర్ అయ్యారు. ఇక అయోధ్య తీర్పుఇచ్చిన ఐదుగురు జడ్జిలలో ఈయన కూడా ఒకరు. ఇక ఇతర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం అయ్యారు.
మేఘాలయ గవర్నర్ గా చౌహన్
మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బైస్
నాగాలాండ్ గవర్నర్ గా గణేషన్
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్లా
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా త్రివిక్రమ్ పట్నాయక్
మణిపూర్ గవర్నర్ గా అనసూయ
బీహార్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్
సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్
అస్సాం గవర్నర్ గా గులాబీ చంద్ కటారియా
జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మిశ్రాను కేంద్రం నియమించింది.
ఇక మహారాష్ట్ర గవర్నర్ భగవంత్ కొశ్యారి, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణన్ మాథూర్ ల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీనితో ఆయా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







