'రాయ్ లో వివేక్ ఓబెరాయ్..
- May 02, 2016
కర్ణాటకకు చెందిన మాజీ గ్యాంగ్‌స్టర్ ముత్తప్ప రాయ్ జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాయ్'. వర్మ 'రక్తచరిత్ర'లో నటించిన వివేక్ ఓబెరాయ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. దాసరి కిరణ్ కుమార్ సమర్పణలో సీఆర్ మనోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను బెంగళూరులో విడుదల చేశారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ- ''30 రూపాయలతో ప్రారంభమవుతుంది అతని జీవితం. 30 ఏళ్ల నేర జీవితంలో 30 వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? ఇరవై హత్య కేసుల్లో నుంచి 21 నెలల్లో ఎలా బయటపడ్డాడు? 'నేరస్థుడి జీవితం చీకటి' అని చరిత్ర చెబితే, 'కాదు.వేయి సూర్యుల వెలుగు' అని ఎలా నిరూపించాడు? నేరాలు చేసినతణ్ణి కోట్ల మంది ప్రజలు ఎందుకు అభిమానిస్తున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది'' అని తెలిపారు. ''యాభై ఐదు కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్న చిత్రం ఇది. హిందీ హక్కులను రాజు చద్దా, సునీ లుల్లా, తమిళ హక్కులను సౌతిండియన్ ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గంగరాజు సొంతం చేసుకున్నారు'' అని నిర్మాత చెప్పారు. ముత్తప్ప రాయ్, వివేక్ ఓబెరాయ్, దాసరి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







